26.6 C
Hyderabad
Monday, August 3, 2026

టిపిసిసి లీగల్ సెల్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా టిపిసిసి లీగల్ సెల్ ఆధర్యం లో నిర్వహించారు. లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ దయాకర్ గౌడ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సోనియా గాంధీ చేసిన కృషిని కొనియాడారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన తో పాటు వివిధ వర్గాలకు సోనియా గాంధీ అందించిన సేవలను కొనియాడారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీగల్ సెల్ న్యాయవాదులు ఆకుల రమేష్,రామకృష్ణ,శ్యాంబాబు,శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article