నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని మిర్చి కంపౌండ్ లో యూసుఫ్(45) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహారాష్ర్టలోని నాందెడ్ కు చెందిన యూసుఫ్ తోపాటు మరో ఇద్దరు ఓ ట్రాన్స్ పోర్టు కార్యాలయం ఎదుట నిద్రించారు. ఉదయం యూసుఫ్ దారుణ హత్యకు గురికాగా, మిగతా ఇద్దరు వ్యక్తులు అక్కడ కనిపించలేదు. దుండగులు అతడిని గొంతుకోసి హతమర్చారు. ట్రాన్స్ పోర్టు యజమాని పోలీసులకు సమాచారం అందించగా వన్ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి, ఎస్సై మొగులయ్య ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ ను రప్పించారు. యూసుఫ్ తోపాటు నిద్రించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.