- విద్యార్థులకు బహుమతులు అందజేసిన జిల్లా జడ్జి
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ పోటీలలో కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. కాకతీయ మొదటి సంవత్సరం విద్యార్థిని పి.ప్రణవి ప్రథమ స్థానంలో నిలువగా, ఆర్.శ్రీలేఖ రెండవ స్థానంలో, సెకండియర్ విద్యార్థిని అక్షర మొదటి స్థానంలో నిలిచారు. వారికి జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తి సునీత కుంచాల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. ఏసీబీ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్థినిలను ప్రిన్సిపాల్ రణదీష్, వైస్ ప్రిన్సిపాల్ కిరణ్ లు అభినందించారు.

