25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నాగన్న బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

Must read

📰 Generate e-Paper Clip

  • మంత్రి జూపల్లి కృష్ణా రావు

లింగపేట, బతుకమ్మ : లింగంపేటలోని నాగన్న బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన లింగంపేటలోని నాగన్నబావిని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాగన్నబావికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. పర్యటక రంగం అభివృద్ధి చెందితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మంత్రి వెంట కలెక్టర్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, నాయకులు, అధికారులు ఉన్నారు.

More articles

Latest article