నాగన్న బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

మంత్రి జూపల్లి కృష్ణా రావు లింగపేట, బతుకమ్మ : లింగంపేటలోని నాగన్న బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన లింగంపేటలోని నాగన్నబావిని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాగన్నబావికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. పర్యటక రంగం అభివృద్ధి చెందితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మంత్రి వెంట కలెక్టర్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, నాయకులు,...