27.3 C
Hyderabad
Friday, July 31, 2026

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలి

Must read

📰 Generate e-Paper Clip

తోట కమలాకర్ రెడ్డి 

సిద్దిపేట్, బతుకమ్మ : పట్టణాల నుండి పట్టు కొమ్మలైనా పల్లెలకు పాకి యువత జీవితాలను సర్వ నాశనం చేస్తున్న డ్రగ్స్ పై యుద్ధం కై అందరు నడుము బిగించాలని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనలో అందరు భాగస్వాములు కావాలని తోట కమలాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏంటి డ్రగ్స్ అవార్నెస్ కార్యక్రమం లో భాగంగా శుక్రవారం ఆయన రన్ ఫర్ ఏంటి డ్రగ్స్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ పై యుద్ధం ప్రారంభించిన తను డ్రగ్స్ నిర్ములనకై మిడిదొడ్డి మండలంలో ఏంటి డ్రగ్స్ యూత్ ఫోర్స్, సిద్దిపేట్ రన్నర్స్ అసోసియేషన్ సంస్థల ఆధ్వర్యంలో రన్ ఫర్ ఏంటి డ్రగ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన్నట్లు తెలిపారు.డ్రగ్స్ మహమ్మారీ పట్టణాల నుండి గ్రామాలకు చాప కింద నీరులా విస్తరిస్తోందని అన్నారు. ఈ డ్రగ్స్ కారణంగా మంచి భవిష్యత్ ఉన్న యువత తమ జీవితాలను సర్వ నాశనం చేసుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ డ్రగ్స్ కారణంగా ఒక వ్యక్తే కాదు మొత్తం గ్రామము, రాష్ట్రము, దేశము,సమాజమే నాశనం అవుతోందని తెలిపారు. ఇంతటి డ్రగ్స్ మహమ్మారిని కూకటి వేళ్ళతో పీకి పారాయలంటే ఇంటింటికి, వ్యక్తి వ్యక్తికి డ్రగ్స్ వల్ల అనార్తలను గురించి అవగాహన కలిపించాలన్నారు.ఇందు కోసమే ఈనెల 13 నుండి 22 వరకు రన్ ఫర్ ఏంటి డ్రగ్స్ అవర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అయన తెలిపారు.ఇట్టి బృహత్తర కార్యక్రమంలో  అందరు తమ గురుతర భాద్యతగా భాగస్వాములై డ్రగ్స్ రహిత గ్రామం, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనాకై కృషి చేయాలని ఆయన కోరారు.

Everyone should be involved in building a drug free society

More articles

Latest article