23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

పసుపు బోర్డు కోసం ‘మహా’ పేచీ

Must read

📰 Generate e-Paper Clip

. తగ్గేదేలే అంటున్న ఎంపీ ధర్మపురి అర్వింద్

. ఢిల్లీలో చురుగ్గా పావులు కదుపుతున్న నాయకుడు

. బోర్డు విధివిధానాలపై పూర్తయిన కసరత్తు

. మొదలైన డైరెక్టర్లు, అధికారుల ఎంపిక ప్రక్రియ

జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు అంతా ఓకే అనుకున్న తరుణంలో మహారాష్ర్టకు చెందిన కేంద్ర మంత్రులు కొత్త పేచీ పెట్టారు. తమ రాష్ర్టంలో పసుపు సాగు విస్తీర్ణం పెరిగిందని చెబుతూ బోర్డును తమ రాష్ట్రానికి తరలించుకుపోయే ప్రయత్నాలకు తెరలేపారు. ఇదిలా ఉండగా జిల్లాలో మూడు దశాబ్దాల పాటు కొనసాగిన పసుపుబోర్డు ఉద్యమానికి ఎంపీ ధర్మపురి అర్వింద్ ద్వారా పరిష్కారం లభించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో బోర్డును మరో రాష్ట్రానికి తరలించకుండా అర్వింద్ తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు.

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటే లక్ష్యంగా గల్లీ నుంచి ఢిల్లీదాకా కాలికి బలపం కట్టుకుని తిరిగిన ఎంపీ ధర్మపురి అర్వింద్ చివరకు ప్రధాని మోదీతో స్పష్టమైన ప్రకటన చేయించిన విషయం తెలిసిందే.  దీంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. అర్వింద్ కృషి కారణంగా టర్మరిక్ బోర్డు విధివిధానాలపై కసరత్తు పూర్తి కాగా, అధికారులు, సభ్యుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. సీనియర్ నాయకుడిని చైర్మన్ గా నియమించాలనే ఆలోచనలో ఉన్నారు. డైరెక్టర్లుగా ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, రైతులు, వ్యవసాయశాస్ర్తవేత్తలు, ట్రేడర్లను నియమించనున్నారు. అలాగే వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలశాఖ, ఆయుష్ విభాగాల నుంచి రొటేషన్ విధానంలో దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారిని సభ్యులుగా నియమించనున్నారు.  

తరలించుకుపోయేందుకు ‘మహా’ ప్రయత్నాలు

పసుపు బోర్డు ఉద్యమానికి దేశంలోనే  కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నిజామాబాద్ జిల్లాలో బోర్డు ఏర్పాటుకు అంతా ఓకే అయిన సమయంలో మహారాష్ర్టకు చెందిన నాయకులు పేచీ పెట్టే ప్రయత్నాలు చేస్తుండడం కొత్త చర్చకు దారి తీసింది. తమ  రాష్ర్టంలో పసుపు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, బోర్డు తమ రాష్ర్టంలోనే ఏర్పాటు చేయాలని వారు చర్చకు తెరలేపారు. ఇందులో భాగంగా ఆ రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాజకీయ రంగ ప్రవేశం నుంచి పసుపు బోర్డు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధర్మపురి అర్వింద్ మాత్రం వెనక్కి తగ్గేదేలే అనే సంకేతాలు ఇస్తున్నారు. మహారాష్ర్టలో ఎన్నికలు పూర్తికావడంతో అర్వింద్ ఇక పసుపు బోర్డుపై దృష్టి సారించారు. నిజామాబాద్ జిల్లాలోనే బోర్డు ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. మహారాష్ర్ట రాష్ర్టకు చెందిన సీనియర్లకూ ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దని భావిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలో సంబంధిత శాఖ, పార్టీ పెద్దలను కలిసి కృషి చేస్తున్నారు.

మన జిల్లాలోనే అధిక దిగుబడి

ప్రధానంగా తెలంగాణలోని జగిత్యాల, నిర్మల్, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో పసుపు సాగవుతుండగా, నిజామాబాద్ జిల్లాలోనే 40శాతం సాగువుతోంది. దేశంలోని ఆయా రాష్ర్టాల్లో 11.61 లక్షల టన్నుల పసుపు దిగుబడి వస్తుండగా, గత సీజన్ లో నిజామాబాద్ మార్కెట్ కు 75 వేల టన్నుల పసుపు వచ్చింది.  జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటైతే అంతర్జాతీయ ఎగుమతులు ఇక్కడి నుంచి మొదలవుతాయి. పసుపుశుద్ధి, కర్క్యుమిన్, ఆయిల్ పరిశ్రమలు ఏర్పాటు అనివార్యం కానుంది. తద్వారా జిల్లా వాణిజ్యపరంగా, ఉపాధిపరంగా వేగంగా పుంజుకోనుంది.

మూడు దశాబ్దాల నాటి కలను నెరవేర్చి..

జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం మూడు దశాబ్దాలపాటు ఉద్యమాలు కొనసాగగా, దీనిపై ధర్మపురి అర్వింద్ ఒక  స్పష్టత తీసుకువచ్చారు. రాజకీయ పార్టీల నాయకులు పసుపు బోర్డును పూర్తిగా రాజకీయ అంశంగా మార్చగా, పార్లమెంట్ అభ్యర్థుల గెలుపోటములను శాపించే స్థాయికి చేరింది. సరిగ్గా ఇదే సమయంలో ఎంపీగా పోటీ చేసిన అర్వింద్ బోర్డు సాధించే తీరుతానని ప్రటించి ఆ దిశగా ముందుకు వెళ్లారు. చివరకు ప్రధాని మోదీతో జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయించారు.

More articles

Latest article