రుద్రూర్, బతుకమ్మ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను మాల మహానాడు నాయకులు ఘనంగా నిర్వహించారు. జేయన్సీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర సమరయోధుడు, రాజ్యంగ నిర్మాత, దళిత, బలహీన వర్గాల వికాసానికి పాటు పడిన మహానేత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల మాల మహానాడు ఇంచార్జ్ నవీన్ కుమార్, కిషోర్, సంతోష్, కామయ్య, నర్సింలు, సాయికుమార్, అనిల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
