బాన్సువాడ ,బతుకమ్మ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లాస్థాయి ఇన్‌స్పైర్, రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనను ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. విద్యార్థుల ప్రయోగాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, డీఈవో రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్, ఎంఈవో నాగేశ్వరరావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కుశాల్, తపస్ జిల్లా కార్యదర్శి సంతోష్, పండిత పరిషత్ జిల్లా అధ్యక్షుడు నార్ల అరుణ్, కృష్ణారెడ్డి, నార్ల సురేష్, ఎజాజ్ పాల్గొన్నారు.
