27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

భూమి కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని సిర్ణపల్లి గ్రామానికి చెందిన ఇద్దరి అన్నదమ్ములు తేలు రాజన్న, సాయన్న మధ్య “భూ” తగాదాలు గత కొన్ని రోజులుగా జరగడంతో బాధితుడు తేలు సాయన్న అదే గ్రామంలో సెల్ టవర్ ను ఎక్కడంతో స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.తమ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా  కృషి చేస్తామని నచ్చజెప్పడంతో బాధితుడు టవర్ పై నుండి క్షేమంగా కిందికి దిగి వచ్చాడు. సెల్ టవర్ ఎక్కడానికి గల కారణాలు బాధితుడు తెలియజేస్తూ తమ అన్న రాజన్న పేరు పైననే నా వంతు భూమి ఎక్కించుకున్నాడని తనకు వచ్చే వంతు భాగాన్ని తన పేరుపైన ఎక్కించాలని పలుమార్లు నలుగురు సమక్షంలో మాట్లాడిన బాధితుడు సాయన్న అన్న రాజన్న నిరాకరించడంతో బాధితుడు మనో వేదనతో సెల్ టవర్ ఎక్కినట్లు తెలిపారు.పలుమార్లు స్థానిక ఎమ్మార్వో కు చాలాసార్లు విన్నవించుకున్న తన భూమి తనకు ఎక్కించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడన్నారు.ఈ భూతగదలతో  ఇంతకు ముందు కూడా బాధితుడు సెల్ టవర్ ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ మనోజ్ కుమార్ మాట్లాడుతూ బాధితుడు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

More articles

Latest article