29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఒక్కొకటిగా అన్ని హామీలను నెరవేరుస్తాం

Must read

📰 Generate e-Paper Clip

 నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ ముత్యాల సునీల్ కుమార్

భీమ్ గల్, బతుకమ్మ : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరిగితుందని బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. బుధవారం
మండలంలోని ముచ్కూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.సంవత్సర కాలంలో ప్రజా ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరిస్తూ గత ప్రభుత్వం రూ. 7లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నిలువునా ముంచిందని, నూతన ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని, ఇంకా మిగిలిన రెండు లక్షల పైచిలుకు రుణాలను ప్రజా ప్రభుత్వం త్వరలోనే మాఫీ చేస్తుందని తెలిపారు. వరి పంటకు రూ.500 బోనస్ ఇవ్వడం ద్వారా రైతులు ఆనందంగా ఉన్నారని,ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించి వేలకోట్ల రూపాయలను ఆదా చేశామని అన్నారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసి సీ. ఎం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే ముచ్కూర్ గ్రామానికి దాదాపు రూ.65 లక్షల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ముచ్కూర్ గ్రామ మహిళల కోరిక అయినా బతుకమ్మ ఘాటును నిర్మించామన్నారు. రానున్న నాలుగేళ్లలో ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article