25.9 C
Hyderabad

నవీపేట్ ఎస్సై కి ఘనంగా వీడ్కోలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ బోధన్ : బదిలీ పై వెళుతున్న నవీపేట్ ఎస్సై యాదగిరి గౌడ్ కు సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, యువకులు ఘనంగా వీడ్కోలు పలికారు. మూడు రోజుల క్రితం జరిగిన ఎస్సై ల బడిలీలలో భాగంగా మోపాల్ కు వెళుతున్న నవీపేట్ ఎస్సై యాదగిరి గౌడ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. ముందుగా పోలీసు సిబ్బంది వీడ్కోలు సమావేశం జరిపి పూలమాలలు, శాలువా లతో సత్కరించారు. తదనంతరం పువ్వులు చల్లుతూ కార్ వరకు తీసుకువచ్చారు. వివిధ పార్టీల నాయకులు, యువకులు, సిబ్బంది తో కలిసి ఓపెన్ టాప్ కార్ లో బ్యాండ్ చప్పులతో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్సై యాదగిరి గౌడ్ తనను అభిమానంగా వీడ్కోలు పలికిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

farewell-to-navipet-si

More articles

Latest article