27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రాంపూర్ గ్రామంలో సోషల్ డే

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలం రాంపూర్(కలాన్) గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సోషల్ డే సందర్భంగా బడి పిల్లలతో (మక్) అసెంబ్లీని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్కూలు పిల్లలు ముఖ్య మంత్రిగా,మంత్రులుగా ప్రతిపక్ష నేతలుగా,స్పీకర్ గా పదవులు చేపట్టి శాసన సభ ఎలా నడుస్తుంది,వాదనలు,ప్రతి పాదనలు ఎలా వుంటాయి,సంక్షేమ పథకాలు అమలు,ప్రతి పక్షం పాత్ర మొదలైన అంశాలు అన్ని కళ్ళకు కట్టినట్లు మాక్ అసెంబ్లీ సభనీ విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురలు శ్రీలత,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నార్య,పాఠశాల సిబ్బంది విఠల్, రాజు, నబీ, సాయిబాబా, బుజ్జయ్య, పోతన, శివ నాగేశ్వర రావు, స్వరూప, నీలిమ, పుష్పాలత, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article