రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో రైతు పండగ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రుణమాఫీ, బోనస్ ఇచ్చినందుకు రుద్రూర్ మండలం రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, గ్రామ అధ్యక్షులు పార్వతి ప్రవీణ్ కుమార్, ఇందూర్ కార్తీక్, నిస్సార్, కర్క అశోక్, రైతులు బొట్టే గజేందర్, జక్కు నరసింహులు, దుర్గి గంగాధర్, కాసుల శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.
