Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 November 2024, 8:31 pm Posted by : ramakrishna

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో రైతు పండగ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రుణమాఫీ,  బోనస్ ఇచ్చినందుకు రుద్రూర్ మండలం రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  హర్షం వ్యక్తం చేస్తూ..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, గ్రామ అధ్యక్షులు పార్వతి ప్రవీణ్ కుమార్, ఇందూర్ కార్తీక్,  నిస్సార్, కర్క అశోక్, రైతులు బొట్టే గజేందర్, జక్కు నరసింహులు, దుర్గి గంగాధర్, కాసుల శ్రీనివాస్,  కార్యకర్తలు పాల్గొన్నారు.