27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ద్విచక్ర వాహనం చోరీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలో ద్విచక్రవాహనాల దొంగతనానికి పాల్పడుతున్న ఫొటోలో కనిపిస్తున్న దొంగను ఎవరైనా గుర్తుపడితే సమాచారం అందించాలని వన్ టౌన్ ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు. ఇటీవల వన్ టౌన్ పరిధిలోని రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్నిసదరు వ్యక్తి దొంగిలించుకు వెళ్లాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడిని గుర్తించారు. సదరు దొంగను గుర్తుపడితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ 8712659837 కు సమాచారం అందించాలని తెలిపారు.

Two wheeler theft

More articles

Latest article