బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : నగరంలోని శివాజీ నగర్ లో గల భూలక్ష్మి మాత ఆలయ 5 వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో భక్తులు అభిషేకంతో యజ్ఞం చేశారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాబుజి మాదిగ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు ధర్మారం అవినే, ప్రదీప్, సురేష్, మహేష్, గంగాధర్, రాజు, సాయిలు, భరత్, తదితరులు పాల్గొన్నారు.
