ఆర్మూర్, బతుకమ్మ : సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాసిరకం భోజన అందించడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు మేరకు హైదరాబాద్ లోని డీడీ భవన్ ముట్టడికి బయల్దేరిన బీజేవైఎం నాయకులను ఆర్మూర్ లో పోలీసులు అరెస్టుచేశారు. బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు కలిగోట ప్రశాంత్, బీజేవైఎం పట్టణ ఉపాధ్యక్షుడు పెద్దోళ్ల భరత్, ప్రమోద్ తదితరులు పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉన్నారు.
