24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఏబీవీపీ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో గర్ల్స్ హై స్కూల్ లో గురువారం మధ్యాహ్న భోజనాన్ని ఏబీవీపీ నాయకుడు గంధం యోగేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం విద్యార్థులు సరిగా ఉండడం లేదని విద్యార్థులు తినే భోజనంలో చిన్న చిన్న రాళ్లు పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఏబీవీపీ నాయకులకు తెలియజేశారు. అదే క్రమంలో ప్రిన్సిపాల్ తో విద్యార్థులకు రాళ్లు ఆహారం పురుగులు రాకుండా చూసుకోవాలని ప్రిన్సిపాల్ ను హెచ్చరించడం జరిగిందన్నారు. మధ్యాహ్న భోజనంలో ఇలాంటి సమస్యలు ఎదురైతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శైబాస్ రాజు కాజా శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article