27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విజయ డెయిరీ పాల బిల్లులు తక్షణమే చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

ధర్పల్లి, బతుకమ్మ: ప్రతినిత్యం,ప్రతి ఇంట్లో  చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు పాలు లేనిది రోజు గడవదు. అలాంటి పాలతో సెంటర్ నిర్వాహకులకు ప్రభుత్వం బిల్లు చెల్లించకుండా బాధపెడుతుందని మంగళవారం  ధర్పల్లి మండల కేంద్రంలో గల విజయ డైరీ బి.ఎం.సి.యు ముందు పాల కేంద్రాల సెంటర్ నిర్వాహకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల కేంద్రాల నిర్వహకులు మాట్లాడుతూ……..గత మూడు నెలలుగా విజయ డైరీ పాల బిల్లులను  చెల్లించక మొత్తం ఐదు బిల్లులు అయినప్పటికీ ఇప్పటివరకు పాల బిల్లులు చెల్లించలేదని నిర్వాహకులు,  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడి రైతులు సెంటర్ నిర్వాహకులని అనరాని మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాల బిల్లులు చెల్లించకపోతే పాడి రైతులు గేదెకు దానకు,  తౌడుకు ఎలా భరించాలని రైతులు నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఇలా జరుగుతే సెంటర్లకు పాలు తేవడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాల నుండి ఎప్పుడు జరగని విధంగా పాల బిల్లులు ఆపడం వల్ల పాడి రైతులు, పాల కేంద్రాల సెంటర్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,కావున ఇకనైనా ప్రభుత్వం దిగివచ్చి గత ఐదు నెలల బిల్లులని పాల నిర్వాహకులకు చెల్లించాలని ఒకవేళ సకాలంలో బిల్లు చెల్లించకపోతే  ఈ ధర్నాను మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి వెళ్లి  కలెక్టరేట్ ముట్టడికి కూడా వెనకాడే ప్రసక్తి లేదని నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గాండ్ల సంజీవ్, రాజారెడ్డి,లింగం, గణేష్, నరేందర్, శేఖర్, మానస, శ్రీకాంత్, సాయిలు, సుభాష్ ,రవీందర్,పవన్, సుదర్శన్, సత్యనారాయణ, గంగాధర్, దాసు, రవి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article