విజయ డెయిరీ పాల బిల్లులు తక్షణమే చెల్లించాలి

ధర్పల్లి, బతుకమ్మ: ప్రతినిత్యం,ప్రతి ఇంట్లో  చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు పాలు లేనిది రోజు గడవదు. అలాంటి పాలతో సెంటర్ నిర్వాహకులకు ప్రభుత్వం బిల్లు చెల్లించకుండా బాధపెడుతుందని మంగళవారం  ధర్పల్లి మండల కేంద్రంలో గల విజయ డైరీ బి.ఎం.సి.యు ముందు పాల కేంద్రాల సెంటర్ నిర్వాహకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల కేంద్రాల నిర్వహకులు మాట్లాడుతూ........గత మూడు నెలలుగా విజయ డైరీ పాల బిల్లులను  చెల్లించక మొత్తం ఐదు బిల్లులు అయినప్పటికీ ఇప్పటివరకు పాల బిల్లులు చెల్లించలేదని నిర్వాహకులు,  రైతులు ఆవేదన వ్యక్తం...