ఆర్మూర్, బతుకమ్మ : లిల్లీపుట్ పాఠశాలలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులు సామూహిక రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో రాజ్యాంగానికి సంబంధించిన వ్యాసరచన పోటీని నిర్వహించారు. తదనంతరం విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ.మాట్లాడుతూ భారత రాజ్యాంగం గురించి విద్యార్థులకు తెలియజేశారు. ప్రభుత్వం శరీరం వంటిది అయితే రాజ్యాంగం అనేది ఆత్మ వంటిది అని, రాజ్యాంగం అతిపెద్ద లిఖిత గ్రంథం అని, అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని అన్నారు. దీనిలో ఎన్నో విషయాలు పొందుపరిచారని, 1949 నవంబర్ 26న దీనిని ఆమోదించారని, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని తెలిపారు. ప్రిన్సిపాల్ దాసు మాట్లాడుతూ 2015 నుండి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నవంబర్ 26న ప్రతి పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆమోదించిందని విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
