లిల్లీపుట్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుక
ఆర్మూర్, బతుకమ్మ : లిల్లీపుట్ పాఠశాలలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులు సామూహిక రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో రాజ్యాంగానికి సంబంధించిన వ్యాసరచన పోటీని నిర్వహించారు. తదనంతరం విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ.మాట్లాడుతూ భారత రాజ్యాంగం గురించి విద్యార్థులకు తెలియజేశారు. ప్రభుత్వం శరీరం వంటిది అయితే రాజ్యాంగం అనేది ఆత్మ వంటిది అని, రాజ్యాంగం అతిపెద్ద లిఖిత గ్రంథం అని, అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని...