బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగర పాలకసంస్థ కార్యాలయ ఆవరణలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగంలోని పీఠిక చదివి వినిపించారు. డా.బి.ఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ ఆధ్వర్యంలో రచించబడిన రాజ్యాంగం అన్ని వర్గాల హక్కులకు రక్షణ కల్పించబడిందని తెలిపారు. గత 75 ఏళ్లుగా భారత ప్రజలు దేశం అభివృద్ధి దిశలో వెళ్ళడానికి భారత రాజ్యాంగం పాత్ర ఎంతో గణనీయం అని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
