29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రేపు రాజక్కపేటలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దుబ్బాక మండలం రాజక్క పేట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈనెల 26న ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని అంబేడ్కర్ విగ్రహదాత, రాజకపేట మాజీ సర్పంచ్ బిట్ల వెంకటేశ్వర్లు తెలిపారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ మనుచౌదరి పోలీస్ కమిషనర్ అనురాధ అంబేద్కర్ యువజన సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎస్సీ ఎస్టీ మెంబర్, గుర్రాల శ్రీనివాస్, ఎస్సీ ఎస్టీ కంజుమర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు కుంభాల రవి పాల్గొన్నారు.

More articles

Latest article