26.2 C
Hyderabad
Monday, August 3, 2026

సిఐటియులో చేరిన కాచాపూర్ శివాజీ చాటన్ బట్టి కార్మికులు

Must read

📰 Generate e-Paper Clip

  • సిఐటి యు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ 

భిక్కనూర్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లాలోని  బిక్నూర్ మండలం కాచాపూర్  శివాజీ బీడీ కంపెనీకి చెందిన చాటన్ కార్మికులు సిఐటియు  కార్మికుల కోసం చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం చేరారు. ఈ సందర్భంగా  సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ సిఐటియు నిరంతరం కార్మికుల సమస్యలపై రాజులేని పోరాటాలు చేస్తుందని, కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తూ ప్రభుత్వాలు  అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరంతరం పోరాటాలు చేస్తుందని అన్నారు. సిఐటియు పోరాటాలకు జిల్లాలో కార్మికులందరూ ఆకర్షితులై సిఐటిలో చేరడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఈ జిల్లాలో బీడీ కంపెనీలు  ప్రధానంగా దేశ బీడీ కంపెనీ కార్మికుల నుండి వసూలు చేస్తున్న బలవంతపు వసూళ్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న దేశాయి బీడీ యాజమాన్యం కార్మికులపై అదిరింపులకు బెదిరింపులకు పాల్పడుతున్నారని, మహిళలను అదిరింపులకు బెదిరింపులకు పాల్పడుతున్న దేశ బీడీ కంపెనీ యాజమాన్యంపై   కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శివాజీ బీడీ కంపెనీ కార్మికులకు ప్యాకర్లకు 26 రోజులు కనీసం పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో రాజు, శ్రీనివాస్,  నందగిరిరాజు, భాగ్య, గుర్రాల రాజు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article