25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మానసికంగా కృంగి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: భార్యాపిల్లలు తనను వదిలి వెళ్లిపోవడం, ఎనిమిది నెలల క్రితం తండ్రి చనిపోవడంతో మానసికంగా కృంగిపోయిన ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని పోచమ్మగల్లీ(ముదిరాజ్ వీధి)లో చోటు చేసుకుంది. నరేశ్(40) అనే వ్యక్తిని కుటుంబ కారణాలతో భార్యాపిల్లలు వదిలి వెళ్లిపోయారు. ఆ తరువాత తండ్రి చనిపోవడంతో నరేశ్ మానసికంగా కృంగిపోయి తన ఇంట్లో బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

More articles

Latest article