27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రక్షాళన దిశగా నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం

Must read

📰 Generate e-Paper Clip

  • మున్సిపల్ ఉద్యోగుల్లో అవినీతి ఆరోపణలు వస్తే సహించేది లేదు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ఇటీవల కాలంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ విభాగాల అధికారుల విధుల మీద అనేక ఆరోపణలు వొస్తున్న నేపథ్యంలో, బుధవారం పారిశుధ్య, ఆరోగ్య విభాగంలో పనిచేయుచున్న శానిటరీ ఇన్స్పెక్టర్స్, సర్కిల్ సూపర్వైజరీ ఆఫీసర్లను ప్రస్తుతం వారు పనిచేయుచున్న సర్కిల్ నుండి ఇతర సర్కిల్స్ కి బదిలీలు చేస్తూ కమిషనర్ మంద మకరంద ఆదేశాలు జారీ చేశారు. దశల వారీగా అన్ని విభాగాలలో ప్రక్షాళన చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందన్నారు. పన్నులు, రెవెన్యూ విభాగంలో కూడా, నూతనంగా చేరిన సిబ్బంది, ప్రస్తుతం ఉన్న సిబ్బందితో ప్రక్షాళన చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. వారికి తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వారి పనితీరు మీద నిరంతర పర్యవేక్షణ చేయబడుతుందన్నారు. అన్ని విభాగాలలో పని చేయుచున్న అధికారులు, సిబ్బంది ఎలాంటి జాప్యానికి, అవినీతి ఆరోపణలకు, పక్షపాతానికి తావులేకుండా విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. లేనిచో తగిన విచారణ చేసి, చట్టరీత్యా తగిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Nizamabad Municipal Office towards cleaning

More articles

Latest article