24 C
Hyderabad
Sunday, August 2, 2026

చరిత్ర కట్టడాలను సంరక్షించాలి

Must read

📰 Generate e-Paper Clip

  •  బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతా మూర్తి

బతుకమ్మ,బాల్కొండ: రాష్ట్రంలో ఉన్న పూర్వపు చరిత్ర కట్టడాలను సంరక్షించాలని రాష్ట్ర బీజేపీ సంస్థాగత ఎన్నికల కో రిటర్నింగ్ అధికారి, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతా మూర్తి కోరారు.
బాల్కొండ లో జరిగిన కార్యక్రమంలో “అల్ల కొండ ఊరు ఉద్భవం – ఐదు ఆలయాలకు ప్రసిద్ధి”చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. 1059 లో అల్లయ్య, కొండయ్య ల మల్ల యోధులచే నిర్మితమైన ఆల్లకొoడ పట్టణం దేశంలోనే “రెండో రాజధానిగా” పేరు ప్రఖ్యాతలు ఉన్నాయన్నారు. ఈ విషయం 1780- 1836 కాలంలో మద్రాసు సుప్రీంకోర్టు ప్లీడరు అయిన ఏనుగుల వీరస్వామి “కాశీయాత్ర ” లో పర్యటన చేస్తూ హైదరాబాద్ పట్టణం నుండి అల్లకొండ (బాల్కొండ )వరకు పాదయాత్ర గా 1830 లో జూన్ 26 నుండి 29 వరకు ఆల్లకొoడ లోనే ఉన్నారన్నారు. ఆయన వ్రాసిన డైరీ లో అల్ల కొండ ప్రాంతo లో వ్యవ సాయ పద్ధతులు,ఈ ప్రాంత సంపద,
అల్ల కొండ ఖిల్లా కట్టడాలు ఎత్తైన కొండల పై బురుజుల నిర్మాణాలు రాజా మహల్,క్షత్రియుల గృహాలు,కోట గోడల తో పాటు ప్రధాన ద్వారం కూలి పోతున్నా యని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.పురాతన ఖిల్లా కట్టడాల రక్షణ తో పాటు బాల్కొండ ఖిల్లను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్ద డానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్ని చర్యలూ తీసుకోవాలని కోరారు. రాష్ట్ర పురావస్తు శాఖ వారి ఇచ్చిన లేఖ ప్రకారం ఖిల్లా అంతర్గత భూములు 39 ఏకరాల 17 గుంటలు ఉండాలి,ప్రస్తుతం ఖిల్లా భూముల తో పాటు పూర్వం ఖిల్లా చుట్టూ ఉండే కందకం (నాల) కందకాలు మొత్తం మట్టితో పూడ్చి వేసి భవంతులు గత తెలంగాణ ప్రభుత్వ హయంలో నిర్మించారన్నారు. ఖిల్లా కందకాలు కబ్జాలకు గురైందన్నారు. ఈ నేల 5 వ తేదిన ముఖ్య మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో వివరించానన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఖిల్లలో మిగిలిన భవoతులను మరమ్మతులు చేసి అల్లకొండ ఖిల్ల నీ పర్యాటక కేంద్రంగా గుర్తించాలని వారు కోరారు.కార్యక్రమంలో అల్లకొండ ఖిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు బి.ఆర్ నర్సింగ్ రావు,
మాజీ మండల విద్య శాఖ అధికారి రంగా చారీ,నందిపేట్ కు చెందిన ప్రముఖ పాత్రికేయులు చిన్నం నరహరి,ఖిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు బుసం సత్య నారాయణ సహాయ కార్యదర్శి సంతోష్ కుమార్, బి.నరేష్ కుమార్ తో డి.పవన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article