- మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరికీ ప్రభుత్వపరంగా న్యాయం చేయడానికి నవంబర్ 9 నుండి ప్రారంభించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విజయవంతంగా కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. సామాజిక విద్యా రాజకీయ కుల సర్వే ఇంటింటి కుటుంబ సర్వేకుప్రత్యేక అధికారిగాడిప్యూటీ కమిషనర్ రాజేంద్రప్రసాద్ను నియమించినట్లు తెలిపారు. ఎన్యూమేనెటర్ బ్లాక్ గూగుల్ మ్యాప్ ద్వారా తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. ఒక బ్లాక్లో సర్వే చేసేందుకు సర్వేయర్లు 175 ఇండ్లను గుర్తించి సర్వే చేపడుతున్నారని అన్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలోపది రోజులు పూర్తవుతుందని,మరో రెండు రోజులతో సర్వే కార్యక్రమం పూర్తవుతుందని కమిషనర్ వెల్లడించారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 93 వేల 531 ఇండ్లు సర్వే చేయాలని గుర్తించినట్లు అయితే ఇప్పటివరకు 72,185 ఇండ్లు పూర్తి అయ్యాయన్నారు.ఈ సర్వేలో 756 మంది సర్వేయర్లు చెప్పారు. వారి పైన పర్యవేక్షించడానికి 10 బ్లాక్ లకు ఒక ప్రత్యేక సూపర్వైజర్ లను నియమించామన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో విలీనమైన 9 గ్రామపంచాయతీలకు పర్సనల్ సూపర్వైజర్ లను కూడా నియమించామన్నారు. రెండు రోజుల్లో సర్వే పూర్తి అవుతుందన్నారు.

