24 C
Hyderabad
Sunday, August 2, 2026

పేదలకు ‘డబుల్’ ఇళ్లు ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: నగరంలో నిర్మాణం పూర్తయి రెడీగా ఉన్న 1600 డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని సీపీఎం నగర కార్యదర్శి సుజాత కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని, ప్రజాధనంతో నిర్మించిన ఇళ్లు ప్రజలకు ఉపయోగడపడడం లేదన్నారు. అలాగే ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వం స్థలం ఇవ్వాలని కోరారు. ఆమె వెంట సీపీఎం నగర కమిటీ నాయకులు అనిత, దీపికతోపాటు వనజ, శ్రీదేవి తదితరులున్నారు.

 

More articles

Latest article