ఎల్లారెడ్డి, బతుకమ్మ: పట్టణంలోని టీఎన్జీవోస్ కాంప్లెక్స్ లో ఉన్న మూడు షట్టర్ల తాళాలను దుండగులు శుక్రవారం రాత్రి పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బిర్యానీ హోటల్ లో నుంచి రూ.5వేల నగదు, కంప్యూటర్, షాపులో నుంచి 15 లీటర్ల ఆయిల్ డబ్బాలను ఎత్తుకెళ్లారు. చోరీపై దుకాణదారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. చోరీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు.
