24 C
Hyderabad
Sunday, August 2, 2026

కామారెడ్డి మాల సంఘం జిల్లా కమిటి ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి సిటీ, బతుకమ్మ :                                                                                                                                                               

మాల సంఘం రాష్ట్ర నాయకుల అయ్యల సంతోష్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో మాల సంఘ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు మాల సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంబేద్కర్ ఆశయ సధాన కోసం కృషి చేసే విధంగా పని చేయాలని అన్నారు. నూతనంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సుంకి రతన్ కుమార్, ప్రధాన కార్యదర్శి మైసయ్య, కోశాధికారి ప్రభాకర్, ఉపాధ్యక్షులు కప్ప సత్యం, సిద్ధార్థ రాజ్ సభ్యులు సాయిలు, నరేష్ లక్ష్మణ్ తదితరులకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర నాయకులైన సంతోష్ మాట్లాడుతూ మాల సామాజిక వర్గం అభ్యున్నతికి కృషి చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. నూతనంగా ఏర్పడ్డ మాల సంఘం సభ్యులు తమ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. తమకు ఏకగ్రీవంగా రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article