25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

వికారాబాద్ కలెక్టర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

Must read

📰 Generate e-Paper Clip

తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ

నిజామాబాద్, బతుకమ్మ :  ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియలో భాగంగా వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామసభలో పాల్గొనడానికి వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి, కొడంగల్ తాసిల్దార్, ఇతర రెవెన్యూ సిబ్బందిపై దాడిని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు.  నగరంలోని నూతన  కలెక్టర్ సమీకృత కార్యాలయాల సముదాయాల ఆవరణలో గురువారం తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇలాంటి హీనమైన చర్యల వల్ల ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని అన్నారు.  ప్రభుత్వం వెంటనే స్పందించి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను అరికట్టేలా కఠిన చర్యలతో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ చర్య సమస్త తెలంగాణ ఉద్యోగ సమాజంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీజీఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, కార్యదర్శి సంగం అమృత్ కుమార్,  టీజీఆర్ఈఎస్ఎ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్, పీఆర్టీయూ  జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, కార్యదర్శి కిషన్,  డిస్టిక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు యోహన్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షులు రవీందర్, టీఎన్జీవో కేంద్ర బాధ్యులు గైని గంగారం, పోల శ్రీనివాస్, మచ్చుకూరి సతీష్ ,క్లాస్ 4 జిల్లా అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్, కార్యదర్శి  బీరేందర్ సింగ్, డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కిషోర్, కార్యదర్శి  బబ్యా, టిఎన్జీవో కేంద్ర సంఘ బాధ్యులు గైని గంగారం, పోల శ్రీనివాస్, మచ్చుకూరి సతీష్, టీఎన్జీవో జిల్లా సహధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, చిట్టి నారాయణరెడ్డి, సలహాదారులు ఆకుల ప్రసాద్, టీఎన్జీవో కోశాధికారి దినేష్ బాబు, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు బిఎల్ శంకర్, జాఫర్ హుస్సేన్ ,జాకీర్ హుస్సేన్, ఉమా కిరణ్,గురుచరణ్ వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్  సంఘాలు, అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article