వికారాబాద్ కలెక్టర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్, బతుకమ్మ : ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియలో భాగంగా వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామసభలో పాల్గొనడానికి వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి, కొడంగల్ తాసిల్దార్, ఇతర రెవెన్యూ సిబ్బందిపై దాడిని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. నగరంలోని నూతన కలెక్టర్ సమీకృత కార్యాలయాల సముదాయాల ఆవరణలో గురువారం తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ...