24.1 C
Hyderabad
Monday, August 3, 2026

రైతు రూపాయి నష్టపోవద్దు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: రైతు రూపాయి నష్టపోవద్దని జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గురువారం పరిశీలించారు. ధాన్యం కాంటా, తేమశాతాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను దోపిడీ చేసిందని ధాన్యం కాంటా జరిగేప్పుడే 5 నుంచి 10 శాతం కోత పెట్టిందని విమర్శించారు. ప్రస్తుతం అలా జరగకూడదనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ధాన్యం విక్రయించేందుకు తీసుకువచ్చే రైతులకు సూచనలు, జాగ్రత్తలు వివరించామన్నారు. కాంటా కాగానే సేకరించిన ధాన్యానికి సంబంధించి రసీదులు పూర్తి వివరాలతో ఇస్తామని, రసీదులో రైతుకు చెల్లించాల్సిన డబ్బుల వివరాలతోపాటు బోనస్ వివరాలు ఉంటాయని మంత్రి తెలిపారు. రైతులకు రసీదులు ఇచ్చిన తరువాతే ధాన్యం బస్తాలను తరలిస్తారని, ఈ మేరకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నదన్నారు. మిల్లర్ల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మంత్రి వెంట రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తదితరులున్నారు.

 

More articles

Latest article