రైతు రూపాయి నష్టపోవద్దు

నిజామాబాద్, బతుకమ్మ: రైతు రూపాయి నష్టపోవద్దని జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గురువారం పరిశీలించారు. ధాన్యం కాంటా, తేమశాతాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను దోపిడీ చేసిందని ధాన్యం కాంటా జరిగేప్పుడే 5 నుంచి 10 శాతం కోత పెట్టిందని విమర్శించారు. ప్రస్తుతం అలా జరగకూడదనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ధాన్యం విక్రయించేందుకు తీసుకువచ్చే రైతులకు సూచనలు, జాగ్రత్తలు...