బతుకమ్మ, మెండోరా: మెండోరా మండలంలో ఎస్సై నారాయణ తన సిబ్బందితో బుధవారం పిడిఎస్ బియ్యం పట్టుకున్నారు. మండలంలోని కోడిచర్ల గ్రామం వద్ద పిడిఎస్ బియ్యంతో వస్తున్న ఆటోను పట్టుకొని పోలీసులకు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సమాచార తెలుసుకున్న ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారి శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని కేసు నమోదు చేసి మూడు క్వింటాళ్ల 10 కేజీల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది వాసిమ్ , అక్రమ్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.
