31.8 C
Hyderabad

సమగ్ర కుటుంబ సర్వేను తప్పులు లేకుండా నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నాగిరెడ్డి పేట్ : సామాజిక ఆర్థిక సమగ్ర కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో ప్రభాకర్ చారి అన్నారు. బుధవారం మండలంలో‌ని వాడి గ్రామంలో అధికారులు నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మండలంలో 78 ఎన్యూమరేటర్ బ్లాక్ లను ఏర్పాటు చేసి 76 మంది ఎన్యూమరేటర్ లతో సర్వేను సమగ్రంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో ప్రతి ఇంటికీ వెళ్లి సమగ్ర కుటుంబ సర్వే ఫార్మాట్లలో ఉన్న అన్ని విషయాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని ఫార్మాట్లను పూర్తి చేయాలని సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్న అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాడి గ్రామ మాజీ సర్పంచ్ పర్వత్ రావు ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.

A comprehensive family survey should be conducted without errors

More articles

Latest article