సమగ్ర కుటుంబ సర్వేను తప్పులు లేకుండా నిర్వహించాలి
బతుకమ్మ, నాగిరెడ్డి పేట్ : సామాజిక ఆర్థిక సమగ్ర కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో ప్రభాకర్ చారి అన్నారు. బుధవారం మండలంలోని వాడి గ్రామంలో అధికారులు నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మండలంలో 78 ఎన్యూమరేటర్ బ్లాక్ లను ఏర్పాటు చేసి 76 మంది ఎన్యూమరేటర్ లతో సర్వేను సమగ్రంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో ప్రతి ఇంటికీ వెళ్లి సమగ్ర కుటుంబ సర్వే ఫార్మాట్లలో...