27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధతో చదివించాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: ప్రతి విద్యార్థి పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దాలని మోర్తాడ్ ఎంఈవో సమ్మిరెడ్డి అన్నారు. బుధవారం మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, ప్రైమరీ పాఠశాలను, ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పట్టికలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మణ్ ,గ్రామ ప్రత్యేక అధికారి స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article