32.7 C
Hyderabad

ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన

Must read

📰 Generate e-Paper Clip

. పొతంగల్ మండలం కల్లూర్ లో రాస్తారోకో

బాన్సువాడ , బతుకమ్మ  : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పొతంగల్ మండలం కల్లూరులో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి ఎనిమిది రోజులవుతున్నా కాంటా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలస్యంగా ఏర్పాటు చేసిన అధికారులు ఇప్పుడు కాంటాను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేశారు. రైతులు పోచయ్య, మధు పటేల్, బాలు గుండ, తీరుగొండ, భాస్కర్, బాల బోయి తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article