30.9 C
Hyderabad
Monday, August 3, 2026

గర్భిణీ స్త్రీల, శిశువుల వివరాలు సేకరించాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: గర్భిణీ స్త్రీలు శిశువుల వివరాలను గ్రామాలలో సేకరించాలని మండల వైద్యాధికారి దివ్య తెలిపారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో రొటీన్ ఇమ్యునైజేషన్, హెడ్ కౌంట్ సర్వే వివరాలు సేకరించాలని అలాగే స్త్రీలు, శిశువుల వివరాలు, టీకాలు, టీకాలు వేసుకొని పిల్లల వివరాలు ఇంటింటికి వెళ్లి సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ వెంకటరమణ, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.

More articles

Latest article