- ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
- టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోలు సత్యనారాయణ
బతుకమ్మ, నవీపేట్ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీచర్ ఎమ్మెల్సీ పొలు సత్యనారాయణ అన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (గ ర్ల్స్) ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రచార కరపత్రాలను పంపిణీ చేసి మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు . పెండింగ్ బిల్లులు, పిఆర్సి, మెడికల్ బిల్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సాధన కొరకు ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ తాటి రాజేశ్వర్ రావు, గర్ల్స్ హైస్కూలు ప్రధానోపాధ్యాయులు అనిత, మహిళా ఉపాధ్యాయులు స్వర్ణ, సునీత, తదితరులు పాల్గొన్నారు
