29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పెట్రోల్ బంక్ లో సౌకర్యాలు ఎక్కడ..? 

Must read

📰 Generate e-Paper Clip

-ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు

బతుకమ్మ, వేల్పూర్:  వేల్పూర్ మండలం పరిధిలోని మోతే గ్రామ శివారులో ఉన్న శ్రీరాజరాజేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ భరత్ పెట్రోలియం బంకులో పెట్రోల్, డీజిల్ కోసం వచ్చే ప్రజలకు బంకులో సరైన సౌకర్యాలు లేక వాహనాలకు ఇబ్బందికరంగా మారింది.. అని ప్రజలు  అంటున్నారు.బాత్రూమ్స్, త్రాగునీటి సౌకర్యం,గాలి కొట్టించుకోవడానికి ఎయిర్ మిషన్ కండిషన్స్, వాహనాలు రావడానికి పోవడానికి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడం వల్ల  కస్టమర్లు ఇబ్బందులకు  గురవుతున్నామని తెలిపారు. మేనేజ్మెంట్ ని ప్రశ్నిస్తే ఏమి చేసుకుంటారో చేసుకోకండి అనే సమాధానం? వస్తుందని పలువురు అంటున్నారు. బంకు మెయింటెనెన్స్ సిబ్బంది కష్టమర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సంబంధిత  అధికారులు పట్టించుకోని  చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Where are the facilities in the petrol station?

More articles

Latest article