25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పీడీఎస్ బియ్యం పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోజా కాలనీలో పీడీస్ బియ్యాన్ని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. మినీ ట్రక్కులో తరలిస్తున్న సుమారు 42 బస్తాల బియ్యాన్ని సీజ్ చేసి డ్రైవర్ ఖలీంఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమేర్ సుల్తాన్ వద్ద ఖలీంఖాన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 48గంటల వ్యవధిలో సుమేర్ సుల్తాన్ కు చెందిన వాహనం రెండోది పట్టుబడడం గమనార్హం.

PDS rice harvesting

More articles

Latest article