29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

అధికారులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్  సిటీ, బతుకమ్మ : ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి విచ్చేసిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిజైన్, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్లపై దాడికి తెలంగాణ గజిటెడ్ అధికారుల జిల్లా సంఘం తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అలుక కిషన్ ,సంగం అమృత్ కుమార్ లు సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లా దుద్దడ గ్రామంలో ఒక ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులపై రైతుల ముసుగులో కొంతమంది అధికారులపై దాడి చేయడం హియమైన చర్య అని వారు అభిప్రాయపడ్డారు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని తమ నిరసనలను నిరసనను సంబంధిత వర్గాల వారు చట్టపరిధిలో వ్యక్తం చేయాలి తప్ప చట్టవిరుద్ధమైన పద్ధతులతో దాడికి పాల్పడటానికి తమ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నట్లు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధ్యక్షులు అలుక కిషన్ ప్రధాన కార్యదర్శి సంగం అమృత్ కుమార్ అసోసియేట్ ప్రెసిడెంట్ జలగం తిరుపతిరావు. వైస్ ప్రెసిడెంట్ హనుమంత్ రెడ్డి . కోశాధికారి దేవి సింగ్. ఉపాధ్యక్షులు రాములు, జయంతి . సెక్రటరీ నాగమోహన్, ప్రవీణ్ కుమార్ లావణ్య, సాయి కృష్ణ,సాయిలు, ఇక్బాల్,. వినయ్ కుమార్, గోపికృష్ణ, నాగరాజు, గంగాధర్, చందర్,పావని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

More articles

Latest article