27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మున్సిపల్ కమిషనర్ కొత్త సీసీగా రాకేష్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ కు కొత్త సీసీగా రాకేష్ నియమితులయ్యారు. మొన్నటి వరకు సీసీగా ఉన్న అంజద్ ఖాన్ డిప్యూటేషన్ ను రద్దు చేశారు. ఆయన స్థానంలో నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సూపరింటెండెంట్ రాకేష్ ను సీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవెన్యూ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అంజద్ ఖాన్ ను నగర పాలక సంస్థకు డిప్యూటేషన్ పై తేవడంతో పాటు కీలకమైన సీసీ పోస్టు ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. ఇటీవల కాలంలో నగర పాలక సంస్థ కమిషనర్ గా ఉన్న మంద మకరంద్ బదిలీ కాగానే సీసీని మార్చాలన్న డిమాండ్ పెరిగింది. కొత్త కమిషనర్ గా నియమితులైన దిలీప్ కుమార్ కొత్తగా సీసీగా టౌన్ ప్లానింగ్ కు చెందిన రాకేష్ ను నియమించగా ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

More articles

Latest article