25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : కార్తీక మాసాన్ని పురస్కరించుకొని  రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, మంగళ హారతులు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీకమాసం సందర్బంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది.  అదేవిధంగా మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో గల శ్రీ స్వయంభు బసవేశ్వర (గైనిగుట్ట) ఆలయంలో భక్తులు స్వామి వారికీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వర ఆలయ పూజారి రాజేశ్వర్ అప్ప, శ్రీ స్వయంభు బసవేశ్వర ఆలయ పూజారి పరమేష్ మహారాజ్, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article