భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలతో కలిసి స్వామివారిని సోమవారం దర్శించుకున్నారు.రాష్ట్ర ప్రజలందరిపై లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ వారు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. అనంతరం పద్మగంగ వీరయ్య చారిటబుల్ ట్రస్ట్ భీమ్ గల్, శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం పల్లికొండ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జల ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల్ల లక్ష్మీనారాయణ,పద్మ జగదీశ్వర్,బోగా రాఘవంద్ర, కొప్పుల నర్సయ్య, బుమేశ్వర్,ప్రభాకర్,పవన్ ముందడ, మరవర్ కృష్ణ,బాబీ సింగ్,తదితరులు పాల్గొన్నారు.
